శ్రీమతి అంటే ప్రేమ వున్న వారు “ఈ రోజు వంట ఎందుకు చేయరు?”…మరి మీ శ్రీవారి మాటేమిటి?

                                        (మధుమిత) 
“వారం లో ఆర్రోజులు మేము వంట చేస్తుంటే ఈ ఒక్క ఆదివారం మీరు వంట చేయొచ్చుగా “”అని నేను అన్నపుడు మా శ్రీవారు “వాకే” అన్న ఆదివారం కార్యక్రమాన్ని మీ కోసం ,మావారి పర్మిషన్తో మీకు సమర్పిస్తున్నది మధుమిత (హైదరాబాద్))
ఆదివారం …
నేను బద్దకంగా లేస్తాను…లేచినట్టు నటిస్తాను.తను నా కన్నా ముందే లేచి కిచెన్ లోకి వెళ్లి ఫిల్టర్ కాఫీ రెడీ చేస్తారు.(రాత్రి ఫిల్టర్ వేసింది నేనేనని గమనించాలి) గుడ్ మార్నింగ్ తో కాఫీ కప్ అందిస్తారు. బెటర్ ఆఫ్ కనుక కాఫీ సగం షేర్ చేసుకుంటాను.
“టిఫిన్ ఏం చేయను మధూ..”అంటారు.వెంటనే తనే “ఉప్మా చేయమంటావా?అని అనుకుని (ఉప్మా అయితే వీజీ కనుక) పచ్చి మిర్చి,ఉల్లితో కుస్తీ పడుతుంటే ,పోనీలే పాపం అని వాటిని తరిగిపెట్టి సాయం చేస్తాను.
ఉప్మా మాత్రమే తనే చేసి పెడతారు.కాస్త ఉప్పు తక్కువైనా,ఉప్మా సూప్ లా తయారైనా ప్రేమగా చేసి పెట్టినందుకు తిని పెడతాను.
లంచ్ ఏమిటి?ఓహో …హోటల్ కు తీసుకు వెళ్ళాలా ? “నీ ఇష్టం “అని “ఓ గంట కునుకేసి ఫ్రెషప్ అయి నన్ను హోటల్ కు తీసుకు వెళ్తాడు.అక్కడ మెనూ నా ఇష్టమే…
సాయంకాలం…
నేను నిద్రలో వునప్పుడే పకోడి చేసి పెడతారు.తనంత బాగా నేను కూడా పకోడి చేయలేను.దాని కాంబినేషన్ లో ఫిల్టర్ కాఫీ ..
డిన్నర్ ఏమిటి?హెవీ గా వుంది కదా …నాయర్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చేదా ?ఓహో కావాలా ?అలానే అంటూ అడక్కపోయినా తెస్తారు…వచ్చేప్పుడు స్వీట్ పాన్ మస్ట్ అండ్ షుడ్..
అలా ఆదివారం గడిచిపోతుంది.
బాగా వంట చేశాను కదా…అంటారు.వంట కన్నా తను చూపించిన ప్రేమ గొప్పగా వుందని నాకు మాత్రమే తెలుసు.
శ్రీమతి అంటే ప్రేమ వున్న వారు “ఈ రోజు వంట ఎందుకు చేయరు?”
మరి మీరేమంటారు…?
మరి మీ శ్రీవారి మాటేమిటి?
(మధుమిత కథనంపై మీ స్పందన మాకు తెలియజేయండి.—చీఫ్ ఎడిటర్)
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY